మంత్రి నిమ్మల రామానాయుడు
గుంటూరు జిల్లా – ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెద వడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 19 వ వార్షిోత్సవం లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాభివృద్దిపై ఫోకస్ పెట్టారని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవ్వాలని, జలవనరుల తో ప్రాజెక్టులు నిండి, రాష్ట్రం సంపూర్ణంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించానని అన్నారు.
సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గోశాలను సందర్శించారు. గోవులకు గ్రాసాన్ని అందించారు. గోమాతను పెంచితే ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఎన్డీయే కూటమి సర్కార్ ప్రజల్లో గోవులను సంరక్షించు కోవడం గురించి అవగాహన కల్పిస్తుందని చెప్పారు.
గోవుల రక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అందినంత మేర దోచుకున్నాడని ఆరోపించారు.