అభివృద్ది..సంక్షేమం ఏపీ నినాదం
మంత్రి నిమ్మల రామా నాయుడు
అమరావతి – గత జగన్ రెడ్డి సర్కార్ ఏపీ అభివృద్ది గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 3 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది, సంక్షేమం టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనినే నినాదంగా మార్చుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు.
శుక్రవారం నియోజకవర్గంలోని పెద మామిడిపల్లి, కొత్తపేట, దిగమర్రు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకం , సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తవుతాయని చెప్పారు.
దీని వల్ల వేలాది ఎకరాలకు తాగు, సాగు నీరు అందుతుందని అన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. ప్రధానంగా రహదారులు, నీటి వసతి కల్పించడంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. అన్ని రంగాలకు ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు . దీని వల్ల త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు వీలవుతుందని చెప్పారు నిమ్మల రామానాయుడు.