రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
మంత్రి నిమ్మల రామా నాయుడు
అమరావతి – ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని చెప్పారు మంత్రి నిమ్మల రామా నాయుడు. మంగళవారం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం లో జరిగిన రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా పని చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత వ్యవసాయ అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
గత టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి 72 శాతం పూర్తి చేశామన్నారు నిమ్మల రామానాయుడు.
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ హెక్టారుకు 25 వేల కు పెంచి అందిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజలతో కూడిన ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. గత వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తాము వచ్చాక వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నామని అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా , నష్ట పోకుండా చర్యలు తీసుకున్నామన్నారు.