NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నిర్వాకం పోల‌వ‌రం నాశ‌నం

Share it with your family & friends

ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

అమ‌రావ‌తి – గ‌త ప్ర‌భుత్వం చేసిన నిర్వాకం కార‌ణంగా పోలవ‌రం ప్రాజెక్టును నాశ‌నం చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు. శుక్ర‌వారం శాస‌న స‌భ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ ప్రభుత్వం కావాల‌ని నాశ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల భారీ ఎత్తున న‌ష్టం చోటు చేసుకుంద‌న్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు పెట్టిన ఖర్చు చూస్తే 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం రూ.11,762 కోట్లు ఖర్చు పెడితే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.4,167 కోట్లు ఖర్చు చేసింద‌న్నారు మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి చూస్తే, 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేస్తే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 3.84 శాతం పనులు చేసింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు చూస్తే టిడిపి ప్రభుత్వంలో సున్నా ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో రూ.3,385 కోట్లు ఉందన్నారు ఏపీ మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో చేసింది ఏమీ లేద‌న్నారు. కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికి ప్ర‌యారిటీ ఇచ్చార‌ని ఆరోపించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోపించారు. అన్నీ అబ‌ద్దాలు త‌ప్పా ఒక్క నిజం లేద‌న్నారు మంత్రి.