జగన్ కు అంత సీన్ లేదు
ప్రతిపక్ష నేత హోదా ఎందుకు
అమరావతి – ఏపీ రాష్ట్ర మంత్రి నిమ్మల రామా నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మారుతారని అనుకుంటే తాను ఇంకా సీఎంననే భ్రమల్లోనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్ల పాటు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి దోచు కోవడం దాచు కోవడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామా నాయుడు.
జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కాకుండా ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించు కోవాలని సూచించారు. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని , అది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.