NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల కోసం ప‌డ‌వ ప్ర‌యాణం

Share it with your family & friends

నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసిన మంత్రి

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు మంత్రులు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆదివారం తూర్పు గోదావ‌రి జిల్లాలో మంత్రులు కందుల దుర్గేష్ , కింజార‌పు అచ్చెన్నాయుడు, వంగ‌ల‌పూడి అనిత సంద‌ర్శించారు. రైతుల‌ను, బాధిత ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించి భ‌రోసా క‌ల్పించారు.

ఇదిలా ఉండ‌గా స్వ‌యంగా రంగంలోకి దిగారు నిమ్మ‌ల రామానాయుడు. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇవాళ య‌ల‌మంచిలి మండ‌లం క‌నాయ‌లంక గ్రామ పంచాయ‌తీ మ‌ర్రి లంక‌లో బాధితుల‌ను క‌లిశారు. వారికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.

వ‌ర‌ద నీటి లోనే మంత్రి నిమ్మ‌ల రామానాయుడు స్వ‌యంగా బైక్ న‌డుపుకుంటూ వెళ్లారు. ప్ర‌భుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేశారు. త‌మ ప‌శువులు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయ‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దీనిని గ‌మ‌నించిన నిమ్మ‌ల రామానాయుడు గోదావ‌రిలో ప్ర‌యాణం చేశారు. స్వ‌యంగా అక్క‌డికి వెళ్లి ప‌శువుల‌ను మ‌ర ప‌డ‌వ‌ల ద్వారా రైతుల‌తో క‌లిసి ఒడ్డుకు చేర్చారు .