NEWSANDHRA PRADESH

యుద్ద ప్రాతిప‌దిక‌న పూడిక ప‌నులు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌లపూడి

విజ‌య‌వాడ – వ‌ర‌ద‌ల కార‌ణంగా బీభ‌త్సంగా త‌యారైంది ఏపీ. తాజాగా బుడమేరు గండ్లు పూడిక పనులను నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు దగ్గరుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మంత్రి నిమ్మల రామానాయుడు కు రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. ఆ

మె గండి పూడిక పనులను మంత్రి రామానాయుడు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

బుడమేరు గండ్లు పూడిక పనులను అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిన ఆపకుండా చేయించామ‌ని చెప్పారు. గండ్లు పూడికతో వేలాది మంది వరద ముంపు బాధితులకు ఉపశమనం కలిగించాలనే వర్షాన్ని సైతం లెక్క చేయలేదన్నారు.

గండ్లు పూడిక ఏ మేరకు జరిగిందో గంట గంటకు మంత్రి లోకేష్ డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నార‌ని తెలిపారు.

డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్న గండ్లు పూడిక పనుల నివేదికను చంద్రబాబుకు లోకేష్ అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రే అంత కష్టపడుతుంటే మంత్రులం మేమెంత కష్టపడాలని అన్నారు. వీలైనంత త్వ‌రగా మూడ‌వ గండిని పూడ్చుతామ‌ని చెప్పారు.