నా వద్ద డబ్బులు లేవు – నిర్మలా
పోటీ చేయాలంటే దమ్ముండాలి
న్యూఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేసేందుకు ప్రస్తుతం ఒక్క పైసా కూడా లేదన్నారు. దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడం ఒకింత విస్తు పోయేలా చేసింది. నిర్మలా సీతారామన్ ఓ జాతీయ మీడియాతొ మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఖరీదుగా మారాయని ఆవేదన చెందారు. ఒకప్పుడు విలువలంటూ ఉండేవని ఇప్పుడు కేవలం ఓటు, నోటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అయితే తాను నిబద్దత కలిగిన నాయకురాలిగా ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
చాలా మంది తన వద్ద కోట్లాది రూపాయలు ఉంటాయని అనుకుంటారని కానీ అంత సీన్ లేదన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నంత మాత్రాన డబ్బులు ఉంటాయని అనుకుంటే ఎలా అని ఎదురు ప్రశ్న వేశారు నిర్మలా సీతారామన్. ముందు నుంచి కష్టపడి పైకి వచ్చానని, అదే దానిని తాను ఫాలో అవుతున్నానని చెప్పారు.
తన స్వంతిల్లు తమిళనాడు, మెట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. రెండు ప్రాంతాలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. పార్టీ తనకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.