NEWSTELANGANA

హ‌స్తం..క‌మ‌లం ఒక్క‌టే

Share it with your family & friends

మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురద జల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిల‌దీశారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు నిరంజ‌న్ రెడ్డి.

అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు.. ప్రత్యామ్నాయం లేదన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది సీఎం చెప్పక పోవడం విచారకరమ‌న్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవన్నారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేలి పోయింద‌న్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో నిట్ట నిలువునా మోసం చేశారంటూ మండిప‌డ్డారు నిరంజ‌న్ రెడ్డి.

మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. హ‌రీశ్ రావు ప్ర‌శ్న‌ల‌కు సీఎం, మంత్రులు స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్నారంటూ ఫైర్ అయ్యారు.