నిర్భయ తల్లి షాకింగ్ కామెంట్స్
పశ్చిమ బెంగాల్ – రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు దారుణ హత్యకు , అత్యాచారానికి గురైన డాక్టర్ (నిర్భయ) తల్లి . ఆమె మీడియాతో మాట్లాడారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. పరిస్థితిని చక్క దిద్దడంలో పూర్తిగా సీఎం వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఆమె మీద ఉన్న గౌరవం కూడా పోయిందన్నారు. ఒక సాటి మహిళగా స్పందించాల్సిన మమతా బెనర్జీ సమస్య తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నం చేయడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
ఉన్నతమైన పదవిలో ఉన్న సీఎం చివరకు నిరసన తెలపడం దారుణమన్నారు. “నిందితులపై చర్య తీసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించుకునే బదులు, సమస్య నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మమతా బెనర్జీ నిరసన తెలుపుతున్నారు” అని ఆమె అన్నారు.
ఇవాళ నా కూతురుకు జరిగింది..రేపు ఇంకొకరికి జరగదని గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించారు నిర్భయ తల్లి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.