ఈశాన్య రాష్ట్రాల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంకులు
ఎంఎస్ఎంఈలకు గ్యారెంటీ స్కీం
న్యూఢిల్లీ – పార్లమెంట్ లో బడ్జెట్ 2024ను ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. మంగళవారం ఆమె బడ్జెట్ సందర్బంగా శుభవార్త చెప్పారు ఏపీకి. రూ. 15 వేల కోట్లు ఇస్తున్నట్లు రాజధాని కోసమని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈశాన్య రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పారు.
సదరు రాష్ట్రాలలో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు… ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీంను వర్తింప చేస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి.
.సులభంగా రుణం అందేలా చర్యలు తీసుకుంటామన్నారుముద్ర రుణాలు రూ.10 నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.. 100 ఫుడ్ క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు.. 12 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటు.. క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు.. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు నిర్మలా సీతారామన్.