Friday, April 11, 2025
HomeNEWSNATIONALలాజిస్టిక్‌ వ్యవస్థగా ఇండియన్‌ పోస్ట్‌

లాజిస్టిక్‌ వ్యవస్థగా ఇండియన్‌ పోస్ట్‌

వ‌చ్చే వారం కొత్త ఆదాయ‌పు ప‌న్ను బిల్లు

న్యూఢిల్లీ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బ‌డ్జెట్ 2025లో ఇండియ‌న్ పోస్ట్ లో కొత్త‌గా లాజిస్టిక్ వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. పోస్ట‌ల్ శాఖ‌కు కొత్త రూపు ఇచ్చేలా ప్లాన్ త‌యారు చేశామ‌న్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ప్రోత్సాహం క‌ల్పిస్తామ‌న్నారు. నేషనల్‌ మ్యాన్‌ఫ్యాక్షరింగ్‌ బోర్డు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఆర్థిక కార్య‌క‌లాపాల్లో 70 శాతం మ‌హిళ‌లు ఉండేలా చూస్తామ‌న్నారు. ఇదే వికాస్ భార‌త్ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. 10 రంగాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టామ‌న్నారు. అందులో పేద‌లు, యూత్, అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు ఉన్నార‌ని చెప్పారు. వ‌చ్చే వారంలో ఆదాయ‌పు ప‌న్ను బిల్లుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తామన్నారు.

బీహార్ కు జాతీయ ఆహార సాంకేతిక సంస్థ మంజూరు చేస్తున్నామ‌ని, పీఎం రీసెర్చ్ ఫెలో షిప్ కు మ‌రో 10 వేలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్. 36 ప్రాణాధార మందుల‌పై విధించిన డ్యూటీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశాన్ని మెడిక‌ల్ టూరిజంగా మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments