జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్..డీజిల్
రాష్ట్రాలు ఒప్పుకుంటే తక్షణమే అమలు
న్యూఢిల్లీ – ఇప్పటికే జీఎస్టీ పేరుతో అడ్డగోలుగా బహిరంగంగా దోచుకుంటోంది మోడీ సర్కార్. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు తూర్పార బడుతున్నారు. అయినా ఎక్కడా ఆగడం లేదు భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్.
తాజాగా బాంబు పేల్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే సమయంలో ధారా భారం మోయలేక లబోదిబోని వాపోతున్నారు వాహనదారులు.
పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి కేంద్ర సర్కార్ సిద్దంగా ఉందని ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. దీనిపై నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత కౌన్సిల్ లో పన్ను రేట్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత దీనిని అమలులోకి తీసుకు వస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్.