స్వాతి మలివాల్ ఘటన బాధాకరం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కు చెందిన సంఘటనపై స్పందించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆప్ పై. ఏదో ఒక రకమైన ఒత్తిడి అన్నది లేక పోతే స్వాతి మలివాల్ ఎందుకని తనపై దాడి జరిగిన రోజే ఫిర్యాదు చేయలేదంటూ ప్రశ్నించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే మూడు నాలుగు రోజుల తర్వాత ధైర్యంగా స్వాతి మలివాల్ బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేసిందని, ఈ సందర్బంగా తాను ఆమెను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సదరు సర్కార్ పై ఉందన్నారు.
తమపై లేని పోని ఆరోపణలు చేసే ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీనికి ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.