NEWSNATIONAL

మోదీ పాల‌న అభివృద్దికి న‌మూనా

Share it with your family & friends

ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు

న్యూఢిల్లీ – ఎన్నిక‌ల వేళ మోదీ స‌ర్కార్ మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది. ఈ సంద‌ర్బంగా విత్త మంత్రి నిర్మ‌లా సీతా రామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ పాల‌న సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చారు. విప‌క్షాలు కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయ్యారంటూ ఆరోపించారు. వారికి అడ్డుకోవ‌డం త‌ప్ప ఏమీ చేత కాదంటూ ఎద్దేవా చేశారు.

తాము వ‌చ్చాక దేశాన్ని అన్ని రంగాల‌లో ముందుకు తీసుకు వెళ్లామ‌ని, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను లాభాల బాట‌లో న‌డిచేలా చేశామ‌న్నారు. ఖాయిలా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊతం ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

బ‌డ్జెట్ లో అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉండేలా నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు నిర్మ‌లా సీతా రామ‌న్. జీడీపీ ఏం సాధించామో బడ్జెట్‌లో పొందుపరిచామ‌ని చెప్పారు. అభివృద్ధి పథంలో సాగుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామ‌న్నారు.

సరైన నిర్ణయాలు, విధానాలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పారు ఆర్థిక మంత్రి. భ‌విష్య‌త్తు ఆశా జ‌న‌కంగా ఉంద‌న్నారు .