NEWSNATIONAL

రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ చెప్పాలి

Share it with your family & friends

ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

న్యూఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం లోక్ స‌భ వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. మైనార్టీ ప్ర‌భుత్వం ఎప్పుడు ప‌డిపోతుందో తెలియ‌డం లేద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే ప్ర‌ధాని త‌న‌కు తానుగా దైవాంస సంభూతుడిగా భావిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. త‌న‌కు తాను హిందువుల ప్ర‌తినిధినంటూ గొప్ప‌లు పోతున్నాడ‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామ‌న్, అమిత్ చంద్ర షా.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హిందువులపై కాంగ్రెస్ ద్వేషాన్ని తెలియ జేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు.

“కోట్ల మంది ప్రజలు తమను తాము హిందువులమని గర్వంగా పిలుస్తారని రాహుల్ గాంధీకి తెలియదన్నారు. ఏ మతంతోనైనా హింసాత్మకతను అను సంధానించడం చాలా తప్ప‌న్నారు. రాహుల్ జీ వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.