ప్రవేశ పెట్టనున్న నిర్మలా
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇంకెన్ని పన్నుల భారం పడనుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మోడీ సర్కార్ జనరంజక బడ్జెట్ ను ప్రవేశ పెడతామంటూ ఊరిస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్.
ఫిబ్రవరి 13 వరకు లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతాయని వెల్లడించారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి. కాగా కేంద్ర సర్కార్ సంపన్నులు, ధనవంతులు, కార్పొరేటర్లకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ.
మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారం మేపేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. మోడీ వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.