భారత దేశ పుత్రుడు రతన్ టాటా
నివాళులు అర్పించిన నీతా అంబానీ
ముంబై – ఇటీవలే మృతి చెందిన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా పై ప్రశంసలు కురిపించారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, వారి కుటుంబ సభ్యులు, రిలయన్స్ నాయకత్వం, వేలాది మంది ఉద్యోగులు రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించారు.
నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయన విలువలకు కట్టుబడిన వ్యాపారవేత్త అని కొనియాడారు. ఆయనను ‘గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచారు,
దూరదృష్టి గల పారిశ్రామికవేత్త నే కాదు ఆయన మనసు ఉన్న మారాజు , అద్భుతమైన వ్యక్తిత్వం, పరోపకారి అని ప్రశంసించారు. రతన్ టాటా ఎల్లప్పుడూ సమాజం గొప్ప మేలు కోసం కృషి చేశారని పేర్కొన్నారు నీతా అంబానీ.