NEWSANDHRA PRADESH

విక‌సిత ఏపీ 2047పై ఫోక‌స్ పెట్టండి

Share it with your family & friends

సీఎంతో నీతి ఆయోగ్ బృందం భేటీ
అమ‌రావ‌తి – నీతి ఆయోగ్ బృందం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకుంది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో సీఎంతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ప్ర‌స్తుతం దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ విక‌సిత భార‌త్ పై ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు ఈ సంద‌ర్బంగా నీతి ఆయోగ్ సీఇఓ సుబ్ర‌మ‌ణ్యం. ఇది పూర్తిగా దేశం అభివృద్ది గురించి ఉంటుంద‌న్నారు.

ఇందుకు గాను విక‌సిత భార‌త్ 2047 కోసం విజ‌న్ డాక్యుమెంట్ (ముసాయిదా)ను త‌యారు చేస్తున్న‌ట్లు అందులో భాగంగానే తాము ఏపీకి వ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు నీతి ఆయోగ్ సీఇఓ. ఈ విక‌సిత్ భార‌త్ లో విక‌సిత్ ఆంధ్ర‌ప్రదేశ్ 2047 ఎలా ఉండాల‌నే దానిపై సూచ‌న‌లు, స‌ల‌హాలు, వివ‌రాలు పూర్తిగా ఇవ్వాల‌ని కోరారు.

ఈ కీల‌క స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.