మోడీ ఈరోజే ప్రమాణం చేస్తే బెటర్
సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి సెటైర్లు విసిరారు. మోడీ ఉన్నంత వరకు వారికి అధికారం రాదన్నారు . తాను ప్రతి రోజూ భారతీయ జనతా పార్టీకి, మోడీకి అండగా ఉంటానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రతి నిర్ణయంలో ఎన్డీయే సర్కార్ కు మద్దతు ఇస్తూనే ఉంటానని స్పష్టం చేశారు నితీశ్ కుమార్. ఈసారి ఇన్ని సీట్లు గెలిచిన వారు వచ్చే సారి 2029లో పూర్తి స్థాయిలో 543 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు. మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారని కానీ తాను మోడీని ఇవాళే జూన్ 7నే ప్రమాణ స్వీకారం చేసి ఉంటే బావుండేదన్నారు నితీశ్ కుమార్.
ఈ దేశ చరిత్రలో మోడీ అరుదైన ఘనతను సాధించ బోతున్నారని పేర్కొన్నారు సీఎం. ఆయన ముచ్చటగా మూడోసారి పీఎంగా కొలువు తీరడం గొప్పనైన విషయమని స్పష్టం చేశారు . ఇది ఓ రికార్డ్ గా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాలకు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు మరోసారి.