సత్తా చాటిన తెలుగోడు
ఆల్ రౌండ్ షోతో సూపర్
పంజాబ్ – పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు తెలుగు కుర్రాడు విశాఖకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను సత్తా చాటాడు. ముందుగా టాస్ ఓడి పోయి బ్యాటింగ్ కు దిగింది. ఆది లోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ తరుణంలో బరిలోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించాడు.
కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రెడ్డి 4 ఫోర్లు 5 సిక్సర్లతో దుమ్ము రేపాడు. ఎక్కడా తొట్రు పాటుకు గురి కాకుండా గ్రౌండ్ నలు వైపులా కళ్లు చెదిరేలా షాట్స్ తో అలరించాడు. ప్రధానంగా పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు నితీశ్ కుమార్ రెడ్డి.
ఇదే సమయంలో మైదానంలోకి వచ్చిన మరో యువ కుర్రాడు సమద్ తన అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 12 బంతులు మాత్రమే ఎదుర్కొని 5 ఫోర్లతో 25 రన్స్ చేశాడు. మరో వైపు బౌలింగ్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు నితీశ్ కుమార్ రెడ్డి. 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో సత్తా చాటిన రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.