స్పష్టం చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
అమరావతి – యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నుంచి తన లాంటి యంగ్ ప్లేయర్లు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నాడు. తాను బాగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. రానున్న టోర్నీలు తనకు ముఖ్యమన్నాడు.
ఏపీకి మంచి పేరు తీసుకు వస్తానన్నాడు. కేఎస్ భరత్, హనుమ విహారి, ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు లాంటి ఆటగాళ్లు తనకు స్పూర్తి అని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు విరాట్ కోహ్లీ ఆదర్శమని అన్నాడు.
తన జీవితంలో మరిచి పోలేని అనుభూతిని ఆస్ట్రేలియా టూర్ మిగిల్చిందని చెప్పాడు నితీశ్ కుమార్ రెడ్డి. బీసీసీఐ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అందించిన సహకారం మరిచి పోలేనని అన్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది టాలెంట్ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. వారంతా ఏదో ఒకరోజు దేశానికి ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ తప్పక లభిస్తుందన్నాడు వర్దమాన ఆటగాడు.
ప్రధానంగా ప్రస్తుతం క్రికెట్ ఫార్మాట్ ను టి20 మార్చేసిందన్నాడు. అనామకులను అసాధ్యులుగా మార్చేస్తోందని , అందుకే ఐపీఎల్ కు అంత జనాదరణ లభిస్తోందని చెప్పాడు నితీశ్ కుమార్ రెడ్డి.