కొత్త పాన్ కార్డ్ పై కేంద్రం ప్రకటన
ఎలాంటి డబ్బులు చెల్లించొద్దు
హైదరాబాద్ – మోడీ కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కొత్తగా పాన్ కార్డు 2.0 ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 70 కోట్ల మందికి పైగా పాన్ కార్డును కలిగి ఉన్నారు. వీరందరికీ ఉచితంగానే కొత్తగా పాన్ కార్డు 2.0ను జారీ చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు పలు సూచనలు చేసింది పాన్ కార్డుదారులకు. కొత్త కార్డుకు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దంటూ తెలిపింది. మరింత పారదర్శకంగా ఉండేందుకే తాము తీసుకు వచ్చామని స్పష్టం చేసింది.
కొత్తగా అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వమే నేరుగా , స్వయంగా ఆయా కార్డుదారుల శాశ్వత చిరునామాకు పంపిస్తుందని వెల్లడించింది కేంద్రం.
జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఏ ఫోన్, మెసేజ్, మెయిల్‌కు సమాధానం ఇవ్వకండి అని లేదా ఏదైనా సమాచారం లేదా OTP నంబర్ ఇవ్వకూడదని తెలిపింది. సైబర్ మోసానికి గురి కావద్దంటూ కోరింది కేంద్రం.