నోబెల్ బహుమతి గ్రహీతతో చంద్రబాబు
అమరావతి – పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని, వారి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ప్రముఖ పిల్లల హక్కుల కార్యకర్త, శాంతి బహుమతి గ్రహీత సత్యార్థితో సీఎం భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. ప్రధానంగా బాల్యం కోల్పోయిన బాల బాలికలకు బతుకు పట్ల భరోసా కల్పించేందుకు ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
బాల బాలికల హక్కుల కార్యకర్తను ఈ సందర్బంగా కలుసు కోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు సీఎం. తామిద్దరి మధ్య ప్రధానంగా బాల బాలికల హక్కులు, సంరక్షణ, వారి బాధ్యతపై ఎక్కువగా చర్చకు వచ్చాయని పేర్కొన్నారు .
ప్రతి బిడ్డ హక్కులు, శ్రేయస్సును కాపాడటం అనేది నైతిక ఆవశ్యకత మాత్రమే కాదని, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించగలదనే నమ్మకాన్ని మరింత పెంచేలా చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
పిల్లలు తరగని ఆస్తి అని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మరోసారి హామీ ఇచ్చారు ఏపీ సీఎం.