రాజకీయ కక్ష సాధింపు చర్య
నల్లగొండ జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ నోములకు చెందిన ఇల్లును సీజ్ చేశారు. ఇదిలా ఉండగా నందికొండ పురపాలక సంఘం పరిధి లోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు ధ్వంసం చేశారు ఉన్నతాధికారులు. ఆపై ఇంటికి తాళం వేశారు.
దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హుటా హుటిన హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కు వెళ్లారు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము ఇంట్లో లేని సమయంలో ఎలా సీజ్ చేస్తారంటూ నిప్పులు చెరిగారు నోముల భరత్ కుమార్. కాగా అప్పటికే హాలియా మున్సిపాలిటీ లోకి ఎంటర్ అయ్యారు. పోలీసులు వెళ్లనీయకుండా తీవ్ర స్థాయిలో అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు.
ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇల్లు సీజ్ చేయించారంటూ మండిపడ్డారు. దీనికి ప్రధాన కారకులు ఎవరో కాదని కాంగ్రెస్ నాయకులేనంటూ మండిపండారు నోముల భరత్ కుమార్