షేక్ హసీనాకు భారత్ రక్షణ
పర్యవేక్షించిన అజిత్ దోవల్
న్యూఢిల్లీ – బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనలు విస్తు పోయేలా చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ ప్రధాని పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. ఈ తరుణంలో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు దేశానికి చెందిన ఆర్మీ చీఫ్.
ఇప్పటి వరకు ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో అన్నింటిని వదిలి వేసి పయనమయ్యారు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఆమె ఇంటిని వీడిన వెంటనే ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఇంట్లోకి చొరబడ్డారు. అందినంత మేర దోచుకున్నారు వస్తువులను. చివరకు షేక్ హసీనా వాడే లో దుస్తులను కూడా తీసుకు వెళ్లడం విస్తు పోయేలా చేసింది.
ప్రాణ భయంతో షేక్ హసీనా ఇంగ్లండ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ కూడా పరిస్థితులు ఆశా జనకంగా లేవు. ఈ తరుణంలో ఆమె తన చిరకాల మిత్రుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సాయం చేయాల్సిందిగా కోరారు.
షేక్ హసీనాకు పూర్తి భద్రతతో రక్షణ కల్పించింది భారత ప్రభుత్వం. యూపీలోని ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయినప్పుడు ఆమెకు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా గంట పాటు సమావేశం కావడం విశేషం. ఐఏఎఫ్ , ఆర్మీ చీఫ్ లు, ఎయిర్ చీఫ్ మార్షల్ లు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. బంగ్లాదేశ్ గగన తలాన్ని చూస్తుండడం గమనార్హం.