NEWSTELANGANA

సీఏఏను ర‌ద్దు చేయాలి

Share it with your family & friends

డిమాండ చేసిన ఎన్ఎస్ యుఐ

హైద‌రాబాద్ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఉమ్మ‌డి పౌర స్మృతి (సీఏఏ)ను తీసుకు వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఒక్క బీజేపీ , దాని అనుబంధ పార్టీలు మాత్ర‌మే మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డిగా సీఏఏను వ్య‌తిరేకిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నాయి.

శ‌నివారం సీఏఏకి వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో ఎన్ఎస్ యూఐ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సార‌థ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. త‌క్ష‌ణ‌మే సీఏఏను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఈ ర్యాలీలో హెచ్‌సియు విద్యార్థులు, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ ప్ర‌సంగించారు. మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని ఆరోపించారు.

ఇవాళ ప్ర‌జాస్వామ్యం, భార‌త రాజ్యాంగం అత్యంత ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎమ్మెల్సీ.