NEWSNATIONAL

ఎన్టీఏ కొత్త ప‌రీక్ష‌ల తేదీల ప్ర‌క‌ట‌న

Share it with your family & friends

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ల‌న్నీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. 25 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రైన నీట్ 2024 ఎగ్జామ్ లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌డం, స్కామ్ జ‌రిగిన‌ట్లు తేల‌డంతో ఒక్క‌సారిగా దాని విశ్వ‌స‌నీయ‌త‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

ఇప్ప‌టికే ఎన్టీయే నిర్వ‌హించిన యుజీసీ నెట్ కూడా ప‌రీక్ష నిర్వ‌హించింది. ఆ మ‌రునాడే ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఎన్టీయే యుజీసీ నెట్ , సీఎస్ఐఆర్ నెట్ కోసం కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా జాయింట్ సీఎస్ఐఆర్ యుజీసీ నెట్ జూలై 25 నుండి 27 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది. దీనిని కంప్యూట‌ర్ ఆధారంగా ప‌రీక్ష చేప‌డ‌తారు. ఇక ఎన్సీఈటీ 2024 ప‌రీక్ష జూలై 10న జ‌రుగుతుంద‌.ఇ యుజీసీ నెట్ జూన్ 2024 ఎగ్జామ్ 21 ఆగ‌స్టు , 4 సెప్టెంబ‌ర్ 2024 మ‌ధ్య నిర్వ‌హించ‌నున్నారు.

మూడు పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఉంటాయి. అంతకు ముందు, యుజిసీ నెట్ జూన్ 2024 సైకిల్ పరీక్ష పెన్ , పేపర్ (ఆఫ్‌లైన్) మోడ్‌లో జరిగింది.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ (www.nta.ac.in)ని సందర్శించాలని సూచించారు.

ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (AIAPGET) 2024 ముందుగా నిర్ణయించిన విధంగా 6 జూలై 2024న నిర్వహించబడుతుంది.