పవన్ కళ్యాణ్ జర జాగ్రత్త – సీమాన్
నిప్పులు చెరిగిన ఎన్టీకే పార్టీ చీఫ్
తమిళనాడు – నామ్ తమిలర్ కట్చి (ఎన్టీకే) పార్టీ చీఫ్ సీమాన్ నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం , ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కొణిదెలపై. నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న దానిపై దేశ వ్యాప్తంగా రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే సీమాన్. లడ్డూ సరే దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలతో సతమతం అవుతున్నారని ఆవేదన చెందారు.
ఈ సమయంలో సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సందర్బంగా యాంకర్ వేసిన ప్రశ్నకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కార్తీ స్పందించారు. తిరుపతి లడ్డూ కల్తీ అనేది సున్నితమైన అంశమని పేర్కొన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం పట్ల జాగ్రత్తగా మాట్లాడాలని బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమిళ సినీ పరిశ్రమ మొత్తం కార్తీకి మద్దతుగా నిలిచింది. కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఆయనకు మరో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా మద్దతు ఇచ్చారు.
బరువు తగ్గేందుకు దీక్ష చేస్తున్నాడని, ఓవర్ యాక్షన్ బంద్ చేస్తే బెటర్ అని సూచించారు. పవన్ కళ్యాణ్ తన కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.