NEWSANDHRA PRADESH

ఏపీలో ఎన్టీపీసీ గ్రీన్ ఎన‌ర్జీ భారీ పెట్టుబ‌డి

Share it with your family & friends

రూ. 2,00,000 కోట్లతో ఏపీ స‌ర్కార్ తో ఒప్పందం

అమ‌రావ‌తి – ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది ప్ర‌ముఖ జాతీయ సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్టీపీసీ ) గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్ కంపెనీ. ఈ మేర‌కు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా స‌చివాల‌యంలో ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో ములాఖ‌త్ అయ్యారు ఎన్టీపీసీ గ్రీన్ ఎన‌ర్జీ కంపెనీ ప్ర‌తినిధులు.

ఈ సంద‌ర్బంగా విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏపీలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏపీ ప్ర‌భుత్వంతో రూ. 2,00,000 మేర పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొత్త ఐసీఈ పాల‌సీ 2024 పెట్టుబ‌డుల‌ను ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఎదగడానికి మార్గం సుగమం చేస్తుందని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కాగా ఎన్టీపీసీ కంపెనీ ఆర్ఈ ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఎన్ఆర్డీసీఏపీతో జాయింట్ వెంచ‌ర్ పై సంత‌కం చేసింది.

25 జీ డ‌బ్ల్యూ సౌర‌, ప‌వ‌న‌, 10 జీడ‌బ్ల్యూ పంప్డ్ స్టోరేజీ , 0.5 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజ‌న్ పై దృష్టి సారించ‌నుంది ఎన్టీపీసీ గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రాజెక్టుతో ల‌క్ష‌కు పైగా జాబ్స్ రానున్నాయ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు.