Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీలో పండుగ‌లా పెన్ష‌న్లు పంపిణీ

ఏపీలో పండుగ‌లా పెన్ష‌న్లు పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి పెన్ష‌న్లు

అమ‌రావ‌తి – ఏపీలో ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా పెన్ష‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రూ. 2,717 కోట్ల‌తో 63,77,943 మందికి ఫించ‌న్లు అంద‌జేశారు. కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో ఈనెల 31వ తేదీనే పంపిణీ చేప‌ట్టారు. జ‌న‌వ‌రి 1కి ముందే పేద‌ల ఇళ్ల‌ల్లో డ‌బ్బులు ఉండాల‌నే ఉద్దేశంతో దీనిని చేప‌ట్టామ‌న్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

రాష్ట్రంలో ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. కాగా ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు సమయానికి 53,22,406 మందికి రూ.2256 కోట్లు అందించ‌డం విశేషం.

లబ్దిదారుల ఇళ్లను జీయో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని దీనిని ప‌రిశీలించారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జీయో ట్యాగింగ్ విధానాన్ని తీసుకువచ్చింది కూట‌మి ప్ర‌భుత్వం.

పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సిఎం చంద్రబాబు నాయుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments