ఆర్టీఐ కమిషనర్ గా రెహానా బేగం
ఎన్టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న రెహానా
అమరావతి – ప్రముఖ జర్నలిస్ట్ రెహానా బేగంకు తీపి కబురు చెప్పింది ఏపీ వైసీపీ ప్రభుత్వం. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర సమాచార కమిషనర్ గా ఎంపిక చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వృత్తి పరంగా అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె చేసిన సేవలను గుర్తించింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా ఆమె వైపు మొగ్గు చూపారు. దీంతో కమిషనర్ పదవికి ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.
రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకమైన పదవిలో ఏదైనా ఉందంటే ఒక్క ఆర్టీఐ కమిషనర్ పోస్టు అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించ లేదు రెహానా బేగంకు అత్యున్నత పదవికి ఎంపిక చేస్తారని. ప్రచురుణ, ప్రసార, సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులంతా రెహానాను అభినందనలతో ముంచెత్తారు.
తన పట్ల నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సీనియర్ జర్నలిస్ట్.