NEWSTELANGANA

దీపా దాస్ కు బెంజ్ కారు ఎక్క‌డిది

Share it with your family & friends

బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక‌ర్

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీ ఇంఛార్జ్ కు బెంజ్ కారు కొనిచ్చిన ఆ నాయ‌కుడు ఎవ‌రో చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అయితే ఇదే విష‌యాన్ని ఇప్పుడు కేబినెట్ లో ఉన్న కోమ‌టిరెడ్డి ఆరోప‌ణ‌లు చేశార‌ని ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఏఐసీసీ ఇంఛార్జులుగా పని చేసిన వారంద‌రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత బెంజ్ కారు కొని ఇచ్చిన‌ట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని తెలిపారు.

దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఖండించారు. కానీ తీసుకున్న వ్య‌క్తి లేదా ఇచ్చిన వ్య‌క్తి స్పందిస్తే తాను పూర్తి ఆధారాల‌తో బ‌య‌ట పెడ‌తాన‌ని స‌వాల్ విసిరారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ప్ర‌భాక‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.