DEVOTIONAL

అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు

Share it with your family & friends

8 నుంచి శ్రీ‌వారి బ్ర‌హోత్స‌వాలు

తిరుమ‌ల – కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
అక్టోబ‌రు 2న బుధ‌వారం మహాలయ అమావాస్య చేప‌డ‌తారు. ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ⁠అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడ సేవ చేప‌డ‌తారు. 9న శ్రీవారి స్వర్ణ రథోత్సవం , 11న ర‌థోత్స‌వం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియ‌నున్నాయి. ఈ విష‌యాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు.

13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుంది. అక్టోబ‌ర్ 28న స‌ర్వ ఏకాద‌శి పండుగ జ‌రుగుతుంది. 31న
శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హించ‌నుంది టీటీడీ.