మోడీ డోంట్ వర్రీ – సీఎం
స్పష్టం చేసిన ఓడిశా సీఎం
ఒడిశా – రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీరియస్ కామెంట్స్ చేశారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మ వద్దని కోరారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు.
గురువారం నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యం క్షీణించిందని, దర్యాప్తు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ విషయాలపై విచారణను పక్కన పెట్టి మోడీ చేయాల్సింది ఒక్కటేనని, అది తన ఫోన్ తీసుకుని తనకు రింగ్ చేయడమేనని ఆ మాత్రం దానికి విచారణ ఎందుకు చేపట్టాలని ప్రశ్నించారు సీఎం నవీన్ద పట్నాయక్.
గత 10 సంవత్సరాలుగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. బాగా ఉండడం వల్లనే తాను ప్రచారం చేశానని చెప్పారు.