NEWSNATIONAL

50 ఏళ్ల త‌ర్వాత స్పీక‌ర్ ప‌ద‌వికి పోటీ

Share it with your family & friends

బీజేపీ నుంచి ఓం బిర్లా..కాంగ్రెస్ నుంచి కే. సురేష్

న్యూఢిల్లీ – భార‌త దేశ చ‌రిత్ర‌లో 50 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా లోక్ స‌భ స్పీక‌ర్ స్థానానికి ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. అన్నీ తానై దేశాన్ని త‌న గుప్పిట్లోకి తీసుకున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్ప‌టికే దేశ వ‌న‌రుల‌ను గంప గుత్త‌గా బ‌డే బాబులు, తాబేదారులు, పెట్టుబ‌డిదారుల‌కు అప్ప‌గించుకుంటూ వ‌చ్చారు.

ఈ త‌రుణంలో దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌నం చెంప చెళ్లుమ‌నేలా తీర్పు చెప్పారు. త‌మ‌కు 400 సీట్లు వ‌స్తాయ‌ని బాకాలు ఊదుతూ వ‌చ్చిన కాషాయ ప‌రివారానికి బిగ్ షాక్ త‌గిలింది. విచిత్రం ఏమిటంటే రాముడిని, మోడీని ముందు పెట్టుకుని ప్ర‌చారం చేసినా చివ‌ర‌కు అయోధ్య‌లో ఓట‌మి పాలైంది బీజేపీ.

ఇది ప‌క్క‌న పెడితే లోక్ స‌భ స్పీక‌ర్ స్థానం త‌మ‌కు ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన కూట‌మి ప‌ట్టు ప‌ట్టింది. దీనికి ఒప్పుకోలేదు బీజేపీ, ఆ పార్టీ త‌ర‌పున కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , కిరెన్ రిజిజు, అమిత్ షా రంగంలోకి దిగినా వ‌ర్క‌వుట్ కాలేదు.

స్పీక‌ర్ ప‌ద‌వికి తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, డిప్యూటీ స్పీక‌ర్ పోస్ట్ త‌మ‌కు కేటాయించాల‌ని కోరారు రాహుల్ గాంధీ. ఒప్పుకోక పోవ‌డంతో ఎన్నిక అనివార్యంగా మారింది.