NEWSNATIONAL

మ‌ళ్లీ స్పీక‌ర్ గా ఓం బిర్లాకే ఛాన్స్

Share it with your family & friends

ముచ్చ‌ట‌గా మూడోసారి రికార్డ్

న్యూఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ చ‌క్రం తిప్పుతోంది. స‌భ‌లో అవ‌స‌ర‌మైన మేర మెజారిటీ లేక పోయినా టీడీపీ, నితీశ్ కుమార్ తో జ‌త క‌ట్టి గ‌ట్టెక్కింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది ముచ్చ‌ట‌గా మూడోసారి.

ఇక ప్ర‌భుత్వాన్ని న‌డిపించే బాధ్య‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీదే అయినా స‌భ‌ను న‌డిపించ‌డంలో అత్యంత కీల‌క‌మైన పాత్ర‌ధారి స‌భాప‌తిది. తాజాగా స్పీక‌ర్ పోస్టు ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు పెరిగి పోయాయి. ఉత్కంఠ‌కు తెర దించుతూ మోడీ, అమిత్ షా, కిరన్ రిజిజు మ‌రో సారి చ‌క్రం తిప్పారు. తాము చెప్పిన‌ట్లు వినే వ్య‌క్తి కావాల‌నే ఉద్దేశంతో ఓం బిర్లా వైపు మొగ్గు చూపిన‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా మ‌రోసారి ఓం బిర్లా స‌భా ప‌తి పోస్టుకు దాదాపుగా ఖ‌రారైన‌ట్లు టాక్. కాసేప‌ట్లో ఆయ‌న త‌న నామినేష‌న్ వేయ‌నున్నారు. కాగా విప‌క్షాల‌కు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆశ చూపించిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు విప‌క్షాల‌తో రాజ్ నాథ్ సింగ్, కిర‌ణ్ రిజిజు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.