NEWSNATIONAL

స్పీక‌ర్ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన బిర్లా

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి మోడీ కితాబు

న్యూఢిల్లీ – 18వ లోక్ స‌భ నూత‌న స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు ఓం బిర్లా. ఈ సంద‌ర్బంగా స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. ఈ దేశ చ‌రిత్ర‌లో రెండోసారి స్పీక‌ర్ గా ఎన్నిక కావ‌డం విశేష‌మ‌న్నారు.

స్పీక‌ర్ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన ఘ‌న‌త ఓం బిర్లాకు ద‌క్కుతుంద‌ని కొనియాడారు ప్ర‌ధాన‌మంత్రి. గ‌త ఐదేళ్ల కాలంలో కీల‌క‌మైన బిల్లులు పాస్ అయ్యేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. గ‌తంలో ఎంద‌రో సభా ప‌తులుగా ప‌ని చేశార‌ని కానీ ఓం బిర్లా మాత్రం ప్ర‌త్యేక‌మైన పాత్ర నిర్వ‌హించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

మ‌రో ఐదేళ్ల పాటు లోక్ స‌భ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా కొలువు తీరిన ఓం బిర్లాను ప్ర‌త్యేకంగా అభినందించారు లోక్ స‌భ ప్ర‌తిపక్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రిగిన స్పీక‌ర్ ఎన్నిక‌లో మొత్తం 297 మంది ఎంపీ అభ్య‌ర్థులు ఓం బిర్లాకు అనుకూలంగా ఓటు వేశారు. చివ‌ర‌కు మూజు వాణి ఓటుతో ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు.