14న బౌద్ధ మతం స్వీకరించిన అంబేద్కర్
లక్షల మందితో బౌద్దమతం స్వీకరణ
హైదరాబాద్ – డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షలాది మందితో హిందూ మతం నుంచి బౌద్ద మతం స్వీకరించిన అరుదైన రోజు అక్టోబర్ 14. ఈ రోజుకు విశిష్టమైన చరిత్ర ఉంది. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ భారత దేశానికి, 143 కోట్ల భారతీయులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఇవాళ్టి రోజును ధమ్మచక్ర ప్రవర్తన్ దిన్ అని కూడా పిలుస్తారు. ఇదే రోజును 3,65,000 మంది అనుచరులతో బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఇందులో భాగంగా ధమ్మచక్ర ప్రవర్తన్ దిన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 న జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తలలో ఒకరైన, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నాగ్‌పూర్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక సంఘటనలో బౌద్ధ మతం స్వీకరించారు. ఇది భారతదేశ సామాజిక, మత చరిత్రలో కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది అణచివేతపై ప్రజల విజయాన్ని తెలుపుతుంది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సాటి మనుషులను మనుషులుగా చూడలేని మతం తనకు వద్దే వద్దన్నాడు. అందరినీ సమానంగా చూసే బౌద్ద మతమే గొప్పదని పేర్కొన్నాడు. తాను ఎవరు ఏమనుకున్నా బౌద్దుడిగానే ఉండాలని నిశ్చయించుకున్నానని తెలిపాడు.