ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు
మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ – మోడీ ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడపటి వార్తలు అందేసరికి ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును తీసుకు రానుంది. గత కొంత కాలం నుంచి ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని , దీనికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ వచ్చారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ‘ఒక దేశం ఒకే ఎన్నికల’ బిల్లును ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, బిల్లుకు సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు కూడా చేరవేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో రెండు ఉభయ సభలకు కలిపి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది. అంతే కాదు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శాసన సభలలో 50 శాతం సాధారణ మెజారిటీ కావాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రణాళికను అమలు చేయాలంటే రాజ్యాంగంలో కూడా మార్పు చేయాల్సి ఉంటుందని సమాచారం. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికను సమర్పించింది.