చెక్ బౌన్స్ కేసులో తీర్పు
ఒంగోలు – ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ కు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మోసం చేసినందుకు గాను ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. అంతే కాకుండా జరిమానా కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి బండ్ల గణేశ్ పై. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. చైర్మన్ పదవి కోసం పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ, ఆయన తరపున వకల్తా పుచ్చుకుని కామెంట్స్ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర నేతలను సైతం టార్గెట్ చేశారు బండ్ల గణేశ్. నటుడిగా, నిర్మాతగా , రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తను లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం కోర్టు ఆయనకు జరిమానా విధించడం, శిక్ష ఖరారు చేయడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు బండ్ల గణేశ్.
అయితే పై కోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వడం ఇందులో కొస మెరుపు అనుకోక తప్పదు.