ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్దం..?
డైరెక్టర్ ఇంటి వద్ద పోలీసులు
హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఒంగోలు పోలీసులు సోమవారం హైదరాబాద్ కు రావడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆయనపై ఇప్పటికే కేసు నమోదైంది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించామని, కానీ ఇప్పటి వరకు స్పందంచ లేదని సీఐ శ్రీకాంత్ వెల్లడించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వక పోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకున్నారు.
తాను ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తాను విచారణకు హాజరు కాలేనని , తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు రామ్ గోపాల్ వర్మ. అయితే తను కావాలని తప్పించుకు తిరుగుతున్నారని, విచారణకు సహకరించక పోతే వెంటనే అరెస్ట్ చేసేందుకు వెనుకంజ వేసే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆర్జీవీ అరెస్ట్ కాక తప్పదని సమాచారం.