టీటీడీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు
తిరుపతి – ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయ పూజారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 6న ఉదయం ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం) , రాత్రి శేష వాహనం, 7న ఉదయం వేణుగానాలంకారం, రాత్రి హంస వాహనం, 8న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం , రాత్రి హనుమంత వాహనం నిర్వహిస్తారు.
10వ తేదీన ఉదయం స్వామి వారు మోహినీ అలంకారం , రాత్రి గరుడ సేవ, 11న ఉదయం శివధనుర్భాణ అలంకరణ, రాత్రి కళ్యాణోత్సవము/ గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, 13వ తేదీన ఉదయం కాళీయ మర్దన అలంకారం, రాత్రి అశ్వ వాహనం, 14న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్ప యాగం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి జేఈవో వి. వీరబ్రహ్మం వెల్లడించారు.