ఒంటిమిట్ట శ్రీరాముని మహోత్సవాలు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 3న హరిధ్రా ఘటనంతో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచనున్నారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవాలనల నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి , ఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. ఉగాది పండుగ పర్వదినం సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో తనను కలుసుకున్నారు. స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఒంటిమిట్ట లో జరిగే శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.