Thursday, April 3, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీలో ఆప‌రేష‌న్ గ‌రుడ

ఏపీలో ఆప‌రేష‌న్ గ‌రుడ

ఈగ‌ల్ ఐజీ ఆకే ర‌వికృష్ణ

అమ‌రావ‌తి – ఏపీ డిజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా జూలు విదిల్చారు. ఈగ‌ల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ , పోలీసులు, డ్ర‌గ్స్ శాఖ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్ర‌గ్స్ దుర్వినియోగంపై ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా మెడిక‌ల్ షాపులు, మెడిక‌ల్ ఏజెన్సీల‌పై దాడులు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ. మొత్తం 100 బృందాల‌తో ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేర‌కు ఆపరేషన్ గరుడ ను చేపట్టడం జరిగిందన్నారు.

రాష్ట్ర డిజిపి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం పని చేస్తున్నారన్నారని చెప్పారు. ఈ తనిఖీలకు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టడం జరిగిందన్నారు. గుణదలలో గల ముందుల షాపులో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని అటువంటి మందుల అమ్మకం జరుగుతుందేమో పరిశీలిస్తున్నామన్నారు. ALBENDAZOLE వంటి కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్ ఇంజక్షన్స్ ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారని వాపోయారు.

గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత ఈ విధమైన నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్ డి పి ఎస్ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు ఆకె ర‌వికృష్ణ‌. యువత ఇలాంటి మత్తు టాబ్లెట్ లకు బానిసలు కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి ఇటువంటి అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ తెలిపారు.

డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.మందులకు సరిగా బిల్లులు ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments