మేం మద్దతు ఇచ్చేందుకు రెడీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన తన సమీప ప్రత్యర్థి కొంపెల్ల మాధవీలతపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా ఆయన ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా ముస్లింల వాయిస్ ను వినిపిస్తూ వస్తున్నారు.
తెలంగాణలో గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ కు మద్దతు తెలిపారు. తాజాగా ఆ సర్కార్ కూలి పోవడం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా ఎంఐఎం బేషరతు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం దేశంలో హంగ్ కొనసాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి నుండి తనకు ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా పీఎం అయితే సపోర్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఓ వైసీ.