పని చేయని మోదీ చరిష్మా
ఎద్దేవా చేసిన చిదంబరం
తమిళనాడు – కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. నిన్న జరిగిన రెండో విడత ఎన్నికల సరళిపై స్పందించారు పి. చిదంబరం.
తమ పార్టీ పరంగా అందిన సమాచారం మేరకు ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి పెద్ద ఎత్తున సీట్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆశించిన మేర తన సీట్లను కోల్పోనుందని , కానీ బయటకు చెప్పేందుకు జంకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలను ఎళ్లకాలం మత్తులో ఉంచ లేరన్న విషయం గుర్తిస్తే మంచిదన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ఊహించని రీతిలో ఫలితాలు తమకు సానుకూలంగా రాబోతున్నాయని స్పష్టం చేశారు. శనివారం పి. చిదంబరం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇంకెంత కాలం కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ వస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను ప్రశ్నించారు. ఇకనైనా మారితే మంచిదని సూచించారు.