ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి
అమరావతి – ఏపీలో చిత్తు చిత్తుగా ఓడి పోవడం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్ర నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదన్నారు.
బుధవారం పి. రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్‌లో బార్‌కోడ్ టెక్నాలజీని ఉపయోగించి దీనికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. ఈ మేరకు తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు పి. రవీంద్ర నాథ్ రెడ్డి.
తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా ఏపీలో ఊహించని రీతిలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు జగన్ రెడ్డికి. మరో వైపు మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు దాడులకు దిగడం ఒకింత ఆందోళనను కలిగిస్తోంది.