20న ఆర్మ్ స్ట్రాంగ్ సంస్మరణ ర్యాలీ
వేలాదిగా తరలి రావాలని పా పిలుపు
తమిళనాడు – బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నన్ కె. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు న్యాయం చేయాలంటూ 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై లోని ఎగ్మోర్‌లో సంస్మరణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ సినీ దర్శకుడు పా రంజిత్.
ఈ ర్యాలీకి అన్ని దళిత ఫెడరేషన్‌ల నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాలు, కళాకారులు, కవులు, గాయనీ గాయకులు , ప్రజా ప్రేమికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే బీఎస్పీ చీఫ్ ను దారుణంగా హత్య చేశారు.
తమిళనాడులో దళిత ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాడు కె. ఆర్మ్ స్ట్రాంగ్. పా రంజిత్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో పా రంజిత్ బీఎస్పీ చీఫ్ ను తన స్వంత సోదరుడుంటూ స్పష్టం చేశాడు. అంతలా వీరిద్దరి మధ్య బంధం ఉంది.
ఇద్దరూ అంబేద్కర్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలలో, పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే సర్కార్ పై నిప్పులు చెరిగారు. హత్యకు పాల్పడిన వారిని పట్టుకోవడంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు పా రంజిత్.
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య సెంబియం పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో జరిగిందని, కానీ ఆర్మ్ స్ట్రాంగ్ ను కాపాడలేక పోయారంటూ వాపోయాడు. ఇది కక్ష సాధింపుతో జరిగిన హత్యగా ఆరోపించాడు పా రంజిత్.