ప్రభాస్ సరసన పాకిస్తాన్ ముద్దుగుమ్మ
ఎవరీ సజల్ అలే..ఏమిటా కథ..?
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వైరల్ గా మారింది సజల్ అలే. ఆమె ఎవరు అంటూ తెగ వెతికారు. దీనికి కారణం లేక పోలేదు. తను సీతారామం సినిమా తీసి కంట తడి పెట్టించిన దర్శకుడు హనుమ రాఘవపూడిని ఆకర్షించింది. ఇంకేం తాజాగా తాను డార్లింగ్ ప్రభాస్ తో తీయబోయే సినిమాకు తనను ఎంపిక చేశాడు. దీంతో సజల్ అలే ఎవరనేది తేలి పోయింది. తను ప్రేమ కథను తెర మీద కొత్తగా ఆవిష్కరించ బోతున్నాడు. ఇప్పటికే ఓ ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని ఎంపిక చేశాడు.
ఇప్పుడు ఏకంగా భారత దేశం అంటే గిట్టని పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటి సజల్ అలేని ఏరి కోరి ఎంచుకోవడం విస్తు పోయేలా చేసింది. ఇది తన కథకు సంబంధించనదని, ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదంటూ దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమా ప్రారంభమే కాలేదు..అప్పుడే బేరాలు మొదలైనట్లు టాక్.
ఇది పక్కన పెడితే సజల్ అలే ..మోస్ట్ పాపులర్ లాలీవుడ్ లో. మోడల్ , టెలివిజన్ , చలన చిత్రాలలో నటిస్తోంది. పాకిస్తాన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో తను ఒకరు. పాకిస్తాన్ లోని లాహోర్ లో పుట్టింది. తన వయసు 30 ఏళ్లు. పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంది. మొత్తంగా నటనా పరంగా అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన సజల్ అలీ అయితేనే ప్రభాస్ సరసన సరి పోతుందని దర్శకుడు అనుకోవడం ..వెంటనే ఓకే చెప్పడం విశేషం కదూ.